రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

-

రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సామర్లకోటలోని జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  రేపు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. రేపు పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు.

CM Jagan's visit to Kakinada district tomorrow
CM Jagan’s visit to Kakinada district tomorrow

ఈ లెక్కన ప్రతి మహిళ చేతికి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తి అందించనున్నారన్న మాట. ఇక రేపు సామర్లకోటలో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం ఉండనుంది. అక్కడ 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి. స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్…ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు.

కాగా, నిన్న పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు వైయస్‌.జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news