రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్‌ ఇదే

-

రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు పర్యటించనున్న సీఎం జగన్..మొదట అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగానే..రేపు ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్…10:30 కు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి చేరుకోనున్నారు.

11 గంటలకు కోనవరం బస్టాండ్ సమీపంలో వేదిక దగ్గర వరద బాధిత కుటుంబాలను పరామర్శించునున్న సీఎం జగన్‌…కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులతో ఇంటరాక్షన్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కుక్కునూరు మండలం గుమ్ముగూడెం గ్రామానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌… అరగంట పాటు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్కడే వరద బాధిత కుటుంబాలతో సీఎం ఇంట్రాక్షన్ లో పాల్గొంటారు.

సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌.. స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. రాత్రికి రాజమండ్రిలో విడిది చేయనున్న ముఖ్యమంత్రి జగన్…ఎల్లుండి ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజపు లంకకు చేరుకోనున్నారు. అనంతరం రామాలయం పేట గ్రామం తానేలంకకు చేరుకోనున్న సీఎం జగన్…అయినవిల్లి మండలం, తోటరాముడివారిపేట లో బాధితులతో ఇంట్రాక్షన్ అవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లి కి తిరుగు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news