CM N Chandrababu Naidu to give first pension to beneficiary: ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో అత్యాధునిక L1 RD ఫింగర్ ప్రింట్ స్కానర్ లను కొనుగోలు చేయనుంది.
ఇందుకోసం ఏకంగా రూ. 53 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో అక్టోబర్ నెల నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న LO RD డివైస్ లలో సెక్యూరిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో నకిలీ వేలి ముద్రలతో పింఛన్లను తీసుకుంటున్నారని ఫిర్యాదులు ఉండేది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో ఎలాంటి మోసాలు జరగకుండా పక్క ప్లాన్ తో ఈ నిర్ణయం తీసుకున్నారు.