హైదారాబాద్, వరంగల్ నుండి ఖమ్మంకు పారిశుధ్య కార్మికులు..!

-

వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా వెంటనే ఖమ్మలో పూర్తి స్థాయి సహాయ పనులు మొదలు పెడతాము అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలంలో మాట్లాడిన ఆయన శానిటేషన్ కోసం వరంగల్ హైదారాబాద్ నుండి కార్మికులు వచ్చారు అని అన్నారు. విద్యుత్ సరఫరా ఇచ్చాము, భోజనాలు అందిస్తున్నాం. నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ కూడా జరుగుతుంది.

అలాగే ఫైర్ ఇంజన్ లను కూడా అందుబాటులో తెపించాము. రోడ్లపై ఇండ్లపై ఉన్న బురద తొలగించాలని ఆదేశాలు ఇచ్చాము. 2 రోజులలో సాధారణ స్థాయి తీసుకొచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. తక్షణ సహాయం 10 వేలు నగదు వారి అకౌంట్ లో జమ చేస్తోంది. పోలీసులు సిపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అద్భుత కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా 7400 పైగా కుటుంబాలకు నష్ట పోయినట్లు తాత్కాలిక నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం 10 టీమ్ లతో హెల్త్ టీమ్ వర్క్ చేస్తోంది. ఇంటి ఇంటికి వైద్య చెకప్ జరుగుతుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news