సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజీ మారి పోయింది. ముఖంలో కళ వచ్చింది. మాటల్లో, స్పీచ్‌ల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. సామర్లకోట సభలోనే కాదు.. విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల సమావేశంలోనూ సీఎం జగన్ నిండైన ఆత్మ విశ్వాసంతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ నుంచి వచ్చే మార్చి వరకు పథకాలు, పొలిటికల్ షెడ్యూల్‌ను వైఎస్ఆర్ సీపీ నేతల ముందు ఉంచారు.
మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలకు, సభలకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి నుంచి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మరోపక్క ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లింది. వారం రోజుల్లోనే 10 లక్షల మందిని వైద్యులు పరీక్షించారు. ఇప్పుడు ఏపీలో స్కీమ్‌లంటే జగన్, స్కామ్‌లంటే చంద్రబాబు అనే మాట వినిపిస్తోంది.
సామర్లకోటలో పేదలకు ఇళ్లు ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ భారీ సభలో ప్రసంగించారు. సామర్లకోట పక్కా కాపుల అడ్డా. ఈ ప్రాంతంలో పవన్ కల్యాణ్ సభల కంటే అనేక రెట్లు జనం జగన్ సభకు వచ్చారు. వేలాది జనం సాక్షిగా, నిండైన విశ్వాసంతో సీఎం జగన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మాటల దాడి చేశారు. మాటల శరాలతో పచ్చ బ్యాచ్‌కు సామర్లకోట నుంచి చెమటలు పట్టేలా చేశారు. గతంలో కంటే కాస్త ఎక్కువుగానే పవన్ కల్యాణ్‌పై.. ఒక పద్ధతి ప్రకారం మాటల తూటాలు పేల్చా,రు సీఎం జగన్.