మా నాయకులను కేటీఆర్ బెదిరిస్తున్నారు: రేవంత్‌రెడ్డి

-

కాంగ్రెస్ నేతల ఫోన్లపై బీఆర్ఎస్ నిఘా పెట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమకు సహకరిస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్.. కేంద్రానికి పంపారని అన్నారు. కొంతమందిని కేటీఆరే నేరుగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులపై రేవంత్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఏం చేసిందంటూ కేటీఆర్, హరీశ్ ప్రశ్నిస్తున్నారని.. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ ఇచ్చింది కాంగ్రెసేనని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్‌ పెట్టిన భిక్ష.. సోనియాగాంధీ దయ అని అన్నారు.

తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వారిపై సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నిఘా పెట్టారని.. రాష్ట్ర డీజీపీని తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. అర్వింద్‌ కుమార్‌, జయేశ్‌ రంజన్‌, సోమేశ్‌ కుమార్‌ లాంటి అధికారులు బీఆర్ఎస్​కు చందాలివ్వాలని ప్రోత్సహిస్తున్నారని.. అధికారులు ఆ పార్టీ కార్యకర్తల్లా మారిపోయారని ఆరోపించారు.  డిసెంబరు 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం, ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారెంటీలపై సంతకం పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news