ముఖ్యమంత్రి జగన్ ఇంట సంక్రాంతి పండుగ

-

ముఖ్యమంత్రి జగన్ ఇంట సంక్రాంతి పండుగ ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ దంపతులు గోపూజ చేశారు. అనంతరం గంగిరెద్దులకు సీఎం జగన్- వైఎస్ భారతి.. సారె సమర్పించారు. అనంతరం.. భోగి మంటలు పెట్టారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ దంపతులు.

CM YS Jagan Sankranti Celebrations at Tadepalli Camp Office

ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఊరూ వాడా ఒక్క‌టై.. బంధు మిత్రులు ఏక‌మై..అంబ‌ర‌మంత సంబ‌రంగా జ‌రుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాల‌తో..విజ‌యానందాల‌తో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news