వైఎస్ జగన్ సెల్ఫ్ అనాలసిస్ స్టార్ట్!

ప్రతీ వ్యక్తికీ సెల్ఫ్ అనాలసిస్ చాలా అవసరం! తాను ఏమి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను… ఈ వ్యవహారాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు… ఏలా స్పందిస్తున్నారు… అనే విషయాలపై క్లారిటీ చాలా అవసరం! ఈ విషయంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా… సమీక్షలు నిర్వహించనున్నారు జగన్! ఇందులో భాగంగా… అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్యా, వైద్య ఆరోగ్యం, గ్రామ / వార్డు వాలంటరీ వ్యవస్థ, ప్రణాళికా విభాగాలకు సంబందించిన అన్ని శాఖలతో సీఎం జగన్ సమీక్షలు నిర్వహించ తలపెట్టారు!

జనాలు మెచ్చుకుంటున్నారని, ప్రతిపక్షాలు నొచ్చుకుంటున్నాయని మాత్రమే కాకుండా తనకు తాను తన పాలన ఎలా ఉంది అనే విషయంలో సెల్ఫ్ అనాలసిస్ కు రెడీ అవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! ఈ క్రమంలో తన ఏడాది పాలనపై సీఎం జగన్ వరుస సమీక్షలు చేపట్టనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు జగన్ వరుస సమీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా… తొలి రోజున వ్యవసాయం, రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు వైద్య ఆరోగ్య శాఖ, నాలుగో రోజు గ్రామ/వార్డు వాలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగానికి చెందిన శాఖలతో సీఎం సమీక్ష జరపనున్నారు.

ఇందులో భాగంగా… ఈ వ్యవహారాలపై విద్యా శాఖ మంత్రి సురేష్‌ మాట్లాడుతూ… నవరత్నాలలో విద్యా నవరత్నాలుగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆంగ్ల మాధ్యమ విద్య, విద్యా ప్రమాణాల పెంపు, మాతృ భాషా వికాసం, మధ్యాహ్న భోజన పథకం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, పాదరక్షల పంపిణీ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు! ఈ విషయాలు అన్నింటిపైనా జగన్ తన రెండోరోజు సమీక్షలో సమీక్షించనున్నారని సురేష్ తెలిపారు!