ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలకడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర విభజనతో రాజధాని విషయంలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. గత వైసీపీ పాలకు రాజధానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని.. రాజధానితో పాటు ప్రతీ జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నామని వివరించారు.
సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించినట్టు చెప్పారు. మరో 39 పార్కుల ఏర్పాటుకు నిధులు సిద్ధం చేసినట్టు తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే కూటమి లక్ష్యం అన్నారు. అమరావతి పునర్నిర్మాణం తెలుగు జాతికి ఆత్మవిశ్వాసాన్ని అందించిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాజధానికి అండగా ఉంటామన్న ప్రధాని వ్యాఖ్యలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.