రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు లభించక రైతులు రోడ్డు ఎక్కి ఆందోలన చేస్తున్నా వారి గోడును సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు, మీ మంత్రులు, అధికార యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చొరువ చూపి, మార్కెట్ లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు ఇది న్యాయమేనా..? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.