ఏపీ ప్రజలకు బిగ్ అలర్ఠ్. కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమం ఈనెల 19న ప్రారంభించగా….ఈనెల 29 నాటికి పూర్తి చేయాలని తోలుత నిర్ణయించారు. అయితే యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు నమోదు చేయలేకపోయారు. మిగిలిన కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.
గడువు తర్వాత కూడా నమోదు చేయకపోతే ఫిబ్రవరి ఏడులోగా నేరుగా గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.