బైరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. శాప్ వివాదంపై ఏపీ సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. బైరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరి కేపీరావు. శాప్ మిటింగ్ లో ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ , క్రిడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని అభినందించినట్టు తెలిపినట్టు లేఖలో పేర్కొన్నారు కేపీరావు.
సీఎం జగన్ ను ,మంత్రి రోజాను పొగిడి బైరెడ్డి పొగడనందుకు ఫీలై తనపై దాడి చేయడానికి బైరెడ్డి అనుచరులు సిద్దమయ్యాడని ఆరోపించారు కేపీరావు. బైరెడ్డి ప్రవర్తన ఇలానే ఉంటే చెడ్డపేరు వస్తుందని, చర్యలు తీసుకోవాలని వాట్సప్ ద్వారా లెటర్ ను సీఎంవోకు పంపారు కేపీరావు. సీఎం జగన్ తో పాటు ఆ లెటర్ ను మంత్రి రోజా కూడా ఫార్వార్డ్ చేశారు కేపీరావు. మరి దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.