“నవోదయం” టాపిక్… “చినబాబు”కు కంప్లీట్ క్లారిటీ ఇది!

-

మాటలకూ చేతలకూ ఎంత తేడా ఉంటుంది? నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటుంది! అయితే ఇది పాత సామెత. కొత్త మాట ఏమిటంటే… టీడీపీ కి వైకాపాకు ఉన్నంత తేడా ఉంటుంది.. అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అనే సంఘటన తాజాగా జరిగింది. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది.. అందుకు కారణమైన సంఘటనలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ విషయంపై తనదైన ట్విట్టర్ లో స్పందించారు చినబాబు లోకేష్. ఆదివాసీ బతుకుల్లో “నవోదయం” తెచ్చిన టీడీపీ పాలనకు.. గిరిజనులపై అహంకారపూరిత దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ పాలనకు ఎంత తేడా? అని ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు. కనీసం ఇకనుంచైనా గిరిజనుల పట్ల పాలకుల దృక్పథం మారాలని ఆకాంక్షించారు!

ఇంతకాలం టీడీపీ పాలనలో… ఇప్పటికీ గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులో లేని సంగతి చినబాబుకు తెలిసి ఉండకపోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విషయ పరిజ్ఞానం.. అధికారంలో ఉన్నప్పుడు లేకపోవడమే దీనికి కారణం అయ్యి ఉండొచ్చు! గిరిజనుల ఆడపడుచుల ప్రసవ సమయంలో… కట్టెలతో కట్టిన స్ట్రెచ్చర్ పై ఆసుపత్రికి మోసుకుపోయిన సందర్భాలు కోకొల్లలు. వైద్యం అందక పచ్చి బాలింతరాల్లను సైతం వరదనీటిలో ఏరు దాటించిన సంఘటనలు అనేకం. అయినా కూడా… అది “నవోదయం” అంటున్నారు చినబాబు!

ఇప్పుడు ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జగన్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అవును… అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లోని గిరిజనుల ప్రాంతంలో ప్రగతి కాంతులు వెదజల్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కురుపాంలో గిరిజనులకు ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయం, అక్కడే వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపనలు జరగనున్నాయి. ఇదే క్రమంలో… గిరిజన ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా జగన్ అదే రోజున ప్రారంభించనున్నారు!

ఫలితంగా మాటలకూ చేతలకూ ఉన్న తేడాపై మరోసారి క్లారిటీ ఇవ్వబోతున్నారు. జగన్ మార్కు “నవోదయం” ఇలా ఉంటుందని చెబుతున్నారు! ఇప్పటికే టీడీపీ పాలనలో ఆదివాసీ బతుకుల్లో “నవోదయం” వచ్చేసి ఉంటే.. చినబాబు చెప్పినట్లు టీడీపీ తెచ్చేసి ఉంటే.. ప్రతిరోజూ పత్రికల్లో వైద్యం కోసం గిరిజనులు పడే పాట్లకు సంబందించిన వార్తలు వచ్చేవి కాదు కదా! ఇదే… మాటలకు చేతలకూ ఉన్న తేడా!!

Read more RELATED
Recommended to you

Latest news