ఏపీలో కాస్త త‌గ్గిన క‌రోనా వ్యాప్తి.. నేడు 4,108 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌రోనా వ్యాప్తి కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తుంది. నిన్న‌టి తో పోలిస్తే.. ఈ రోజు కేసుల సంఖ్య కొంత వ‌ర‌కు త‌గ్గింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఆదివారం 30 వేల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. 4,570 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. అయితే గ‌డిచిన 24 గంట‌ల‌లో 22,882 టెస్టులు చేయ‌గా.. 4,108 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అంటే ఆది వారంతో పోలిస్తే.. 7 క‌రోనా టెస్టుల సంఖ్య త‌గ్గింది. అలాగే 462 క‌రోనా కేసులు కూడా త‌గ్గాయి.

corona
corona

కాగ నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం ఈ రోజు 4,108 క‌రోనా కేసులు న‌మోదు అవ‌గా.. ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించలేదు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌తి రోజు క‌రోనా మ‌హ‌మ్మారితో చ‌నిపోతున్నారు. కాగ ఈ రోజు ఎలాంటి మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 696 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 30,182 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news