ఏపీలో కరోనా బీభత్సం.. కొత్తగా 10 వేలకు పైగా కేసులు.. 82 మరణాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 82 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164 కి చేరింది. మొత్తం 3,796 మంది మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు 3,12,687 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 8,976 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36,03,345 టెస్టులు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version