తెలంగాణ‌కు క‌రోనా నుంచి ఇంత పెద్ద రిలీఫా… భార‌త్‌లోనే రికార్డు…!

-

తెలంగాణ‌లో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా జోరందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో కేసుల జోరు ఎక్కువుగా ఉండ‌డంతో ఇక్క‌డ క‌రోనా వ్యాప్తికి అడ్డ‌కట్ట ప‌డుతుందా ? అన్న సందేహాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్నాయి. అటు ప్ర‌భుత్వం తీసుకుంటోన్న ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌తో పాటు క‌రోనా క‌ట్ట‌డికి క‌లెక్ట‌ర్లు కూడా ప్ర‌త్యేక చొర‌వ చూపిస్తున్నారు. పలువురు ఆఫీసర్లు ముందుకొచ్చి గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప‌లు జిల్లాల్లో కోవిడ్ బాధుత‌ల‌కు ఇబ్బందులు లేకుండా క్వారంటైన్ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో తెలంగాణలో క‌రోనా వ్యాప్తికి ప్రాథ‌మిక ద‌శ‌లోనే అడ్డుక‌ట్ట ప‌డుతోంది.

corona
corona

ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 13787 న‌మూనాలు ప‌రిశీలిస్తే ఇందులో 1286 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఈ లెక్క‌లు కూడా క‌లిపితే తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా న‌మోదు అయిన వారి సంఖ్య  68,946కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1066 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 50 వేలు దాటింది. ఇక గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 12 మంది మృతి చెంద‌గా.. మొత్తం మ‌ర‌ణాలు 563గా ఉన్నాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే క‌రోనా రిక‌వ‌రీ విష‌యంలో తెలంగాణ‌లో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కరోనా రికవరీ రేటులో జాతీయ స్థాయిలో ఉన్న 65 శాతంతో పోలిస్తే తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 72 శాతం ఉంది. ఈ విష‌యంలో జాతీయ స్థాయి స‌గ‌టు కంటే తెలంగాణ‌లో రేటు ఎక్కువుగా ఉండ‌డంతో ప్ర‌భుత్వ వ‌ర్గాలు సైతం హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో 84 శాతం హోంఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటుండగా.. 11,935 మంది వివిద ఐసోలేషన్ కేంద్రాలు‌, ఆసుపత్రుల్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనాను క‌ట్ట‌డి చేస్తే తెలంగాణ‌లో క‌రోనా చాలా వ‌ర‌కు క‌ట్డడి అయిన‌ట్టే అని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news