లడ్డు వ్యవహారాన్ని వీధుల్లోకి తీసుకు రాకండి : సీపీఐ నారాయణ

-

లడ్డుపై విచారణకు సీట్ ఏర్పాటు ఏంటి.. సీఎం ఏం చెప్తే అదే సీట్ రిపోర్ట్ గా వస్తుంది. కాబట్టి సీట్ ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని సీపీఐ నారాయణ అన్నారు. సుప్రీంకోర్టు లడ్డు వివాద ఘటనపై సుమోటో గా తీసుకుని విచారణ చేయాలీ. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డు సమస్య మొదటికి వచ్చింది. కమ్యూనిస్టులు భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు. భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి‌‌. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు‌‌. తక్కవ రేటుకు నెయ్యి వస్తుంది అని.. లడ్డులో ఎక్కడలేని దరిద్రాలు కలిపి తినమని చేబుతారా‌‌‌‌‌‌‌.. బుద్దిలేదా అని ప్రశ్నించారు.

నెయ్యి విషయంలో ఎలాంటి అలోచన లేకుండా వైసీపీ టెండర్లు ఇచ్చింది. లోపం దొరికింది కాబట్టి చంద్రబాబు బయటపెట్టారు. రాజకీయ నాయకుడుగా మాత్రమే ధర్మారెడ్డి తిరుమలలో పనిచేశాడు‌‌‌‌‌ ‌‌‌..టిటిడి ఈవో ఒక్కరోజు పనిచేయాలేదు‌‌. లడ్డు నాణ్యత అనేది వైసీపీ ప్రభుత్వంలో లేదు.‌ వారం రోజుల ఉండే నాణ్యత ఒక్కరోజు కూడా లేకుండా చేశారు. విచారణ కమిటిలో అన్ని తెలుతాయి. ఇకపై వీధుల్లోకి లడ్డు వ్యవహారాన్ని తీసుకుని రాకండి అని సీపీఐ నారాయణ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version