ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసు ?

-

ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రరెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రరెడ్డి పై క్రిమినల్ చర్యలకు చిత్తూరు జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జడ్జి రామ కృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై క్రిమినల్ చర్యలకు చిత్తూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రరెడ్డి దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జడ్జి రామ కృష్ణ న్యాయ పోరాటం చేశారు. చిత్తూరు జిల్లా జడ్జి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ (క్రిమినల్ కేసు) దాఖలు చేశారు జడ్జి రామ కృష్ణ. ఈ తరుణంలోనే.. Under Sec. 3(1) (r) (s) and Sec. 3(2) (VII) of SC ST (POA), 1989 and Sec. 379, 380, 500 and 506 IPC కింద మంత్రి రామ చంద్రారెడ్డి పై కేసుల నమోదు అయింది. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పై క్రిమినల్ చేర్యాలకు B.కొత్తకోట పోలీస్ స్టేషన్ కీ చిత్తూరు జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news