అందుకే ఇండియాకి వచ్చాను.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన అబ్బాస్..!

-

ప్రముఖ హీరో అబ్బాస్ గురించి నేటితరం యువతకు పెద్దగా పరిచయం లేకపోయినా నాటితరం యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కాలేజీ యువకుల్లో ఈయన ఒక రోల్ మోడల్.. ప్రేమదేశం , చెలీ లాంటి చిత్రాలలో తన నటనతో అందరినీ మెప్పించిన ఈయన లవర్ బాయ్ గా ఇప్పటికీ ఆయనను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారటంలో సందేహం లేదు. తెలుగులోనే కాదు తమిళ పరిశ్రమలో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న అబ్బాస్ దశాబ్ద కాల క్రితం సినీ ఇండస్ట్రీని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయారు.. దీంతో ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది? అన్న విషయాలపై తాజాగా స్వయంగా వెల్లడించారు.

అబ్బాస్ మాట్లాడుతూ.. 10 సంవత్సరాల క్రితమే నా కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ కి వెళ్లి సెటిల్ అయ్యాను.. అయితే అక్కడ టాక్సీ మెకానిక్ గా, డ్రైవర్ గా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించాను.. అంటూ వెల్లడించారు. ఇది విన్న అభిమానులు అంతా .. ఇంత పెద్ద హీరో ఇలా టాక్సీ డ్రైవర్ గా మారడం ఏంటి అంటూ అభిమానుల సైతం ఆలోచనలో పడగా.. ఒకానొక సమయంలో ఆయనకు సిగరెట్లు కొనుక్కునేందుకు.. ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేక తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయాడట. అందుకే విదేశాలకు వెళ్లి అక్కడ టాక్సీ డ్రైవర్ గా మారానని నిర్మోహమాటంగా చెప్పేశారు అబ్బాస్.

ఇకపోతే సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాల గురించి కూడా ప్రస్తావించాడు. తాను దివాలా తీశానని.. మెంటల్ ఆస్పత్రిలో చేరానని.. చనిపోయారని కూడా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అబ్బాస్.. ఇక దీనికి క్లారిటీ ఇవ్వడానికే భారతదేశానికి వచ్చానని కూడా ఆయన తాజా ఇంటర్వ్యూలో ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news