విజయవాడలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖర్ బాబుకి అభినందనలు తెలిపారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయని… ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారు….నాలుగు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1700 వెయ్యికోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారన్నారు.
ఇన్ స్టంట్ లోన్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని… నాకు కూడా ఈ మధ్య 50 లక్షలు లోన్ ఇస్తామని మెసేజ్ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు వంగలపూడి అనిత. సైబర్ పోలీస్ స్టేషన్ లు జిల్లాకు ఒకటి ఉన్నాయి..ప్రతీ జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎవరూ మనల్ని చెడగొట్టనవసరం లేదు…మన మొబైల్,మొబైల్ లో యాప్ చాలు మనం చెడిపోవడానికి అన్నారు. సైబర్ నేరాల పై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలి…పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.