Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇవాళ రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడుకు కూడా వర్షాలు ఉన్నట్లు తెలిపింది.
ఈ తుఫాను నేపథ్యంలో… ఇవాళ అలాగే రేపు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్, సత్యసాయి అలాగే నెల్లూరు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడం జరిగింది. ఇక.. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలో… ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో.. భయంకరమైన గాలులు విస్తాయని తెలిపింది. ఈ తరుణంలో ఇవాళ అలాగే రేపు.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.