ఏపీకి ‘దానా’ తుఫాన్ ముప్పు వచ్చి పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర అండమాన్‌పై అల్పపీడనం కేంద్రీకృతం అయింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లుండి తుఫాన్‌గా మారనుందట వాయుగుండం.
ఈ తుఫాన్‌కు ‘దానా’గా నామకరణం చేయనుందట ఐఎండీ. ఈ నెల 24న ఒడిశా, బెంగాల్ తీరానికి తుఫాన్ చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో రెండు రోజుల పాటు కోస్తాలో తేలిక పాటి వర్షాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏపీకి ‘దానా’ తుఫాన్ ముప్పు ఉన్న తరుణంలోనే… జనాలు బయటకు రావొద్దని కోరింది వాతావరణ శాఖ.