ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బాలినేనిి శ్రీనివాసరెడ్డి ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి ఆంధ్రజ్యోతి పత్రిక నీచంగా రాస్తుందని..ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు బాలినేని. తనకు పార్టీ ఏ ముఖ్యమని, మంత్రి పదవి కాదని తాను ఎప్పుడో చెప్పానని..అయినా తన పై విష ప్రచారాన్ని మానుకోకపోతే ఆ పత్రిక పై పరువు నష్టం దావా వేస్తానని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు బాలినేని.
నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తాను. pic.twitter.com/Y16a4RFGql
— Balineni Srinivasa Reddy (@balineni_vasu) April 9, 2022
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవిని వదులుకొని వైయస్ జగన్ వైయస్ జగన్ వెనుక నిలబడ్డానని అన్నారు బాలినేని. జగన్ కి తాను వీరాభిమానినని, కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నామని జగన్ అన్నప్పుడే తాను బహిరంగంగా పూర్తి మద్దతు ప్రకటించానని అన్నారు.కాగా 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి టిడిపి పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పై గెలుపొందిన బాలినేని, 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ రావు పై గెలుపొందాడు.