కృష్ణా నదిలో ఈ సారి దుర్గమ్మ తెప్పోత్సవం ఉండదా ?

-

కృష్ణా నదిలో తెప్పోత్సవం మీద సందిగ్దత నెలకొంది. కృష్ణ నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3.77 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మరో రెండు రోజుల్లో జరగాల్సిన తెప్పోత్సవం నిర్వహించాలా వద్దా ? అనే డైలమాలో పడ్డారు దుర్గ గుడి అధికారులు. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం వరద ఉదృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతి ఇస్తామని చెబుతున్నారు.

అయితే దుర్గ గుడి అధికారులు మాత్రం ఇప్పటికే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని సిద్దం చేసేశారు. అయితే నీటి పారుదల నిపుణులు మాత్రం ఒక వేళ వరద ఉదృతి తగ్గినా తెప్పోత్సవం నిర్వహించే అవకాశం లేదని అంటున్నారు. దీంతో తెప్పోత్సవం నిర్వహించాలా వద్దా ? అనే డైలమాలో పడ్డారు అధికారులు. ఇక భారీ వర్షాలు మళ్ళీ కురిసే అవకాశం ఉండడంతో దుర్గమ్మ తెప్పోత్సవం ఉంటుందా ? లేదా అని భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news