తిరుమలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం నారాయణస్వామి సంచలన వాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయ అవినీతి పోవాలంటే ప్రధాని, ముఖ్యమంత్రి పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.సీఎం పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే….జగన్ కి తిరుగు ఉండదన్నారు. షర్మిలా కాంగ్రేస్ పార్టికి మద్దతివ్వడం ఆమె విజ్ఞతకే వదిలేస్తూన్నామని చెప్పారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరూ అధికార పార్టీ నాయకులు విమర్శించారు. నారాయణస్వామి నియమించిన కన్వీనర్లను అంగీకరించేది లేదని.. వైఎస్ జగన్ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. నారాయణస్వామి అధికారులు, పోలీసులను అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.