బుగ్గలు నిమరడం, కన్నీళ్లు తుడవడం కాదు.. కన్నీరు రాకుండా చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వరదలు సమయంలో బయటకు రాను అన్నారు. అయితే గత ప్రభుత్వం దోచేసింది.. డబ్బులు లేవు. ఋషి కొండ పేరు చెప్పి దోచేశారు. కానీ నేను పనులు పూర్తి చేసి మీతో చప్పట్లు కొట్టించుకుంటాను. చాలా కమిట్మెంట్ తో పని చేస్తాను. మీరు పనులు చెప్పండి నేను పూర్తి చేస్తాను అని పేర్కొన్నారు.
అలాగే ఇసుక విషయంలో ఇబ్బంది పెడితే మీరు బలంగా ఎదురు తిరగండి. ఇసుక కి సంబంధించి సమస్య ఉంది. ఇసుక డబ్బు సంపాదన కి మార్గం అయిపోయింది.. ఎవరు జోక్యం చేసుకోవద్దని సీఎం చాలా స్పష్టముగా చెప్పారు. ఎమ్మెల్యేలకి కూడా ఈ విషయం చెప్పారు. ఇసుక మీ హక్కు.. ఇందులో తప్పులును ఉపేక్షించం. అవసరం అయితే అధికారులు ని సస్పెండ్ చేయమని సీఎం చెప్పారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.