ఈ నెల 4, 5న పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్. నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు పవన్ కల్యాణ్.
పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావడంతో సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు అక్కడే ఉండి నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ప్రజలతో పాటు అదికారులతో, నాయకులతో చర్చించనున్నారు. వాటికి కావాల్సిన నిధులను వచ్చే బడ్జెట్ లో కేటాయించనున్నట్టు సమాచారం. పిఠాపురం అభివృద్ధి చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని గతంలో కూడా చెప్పారు. సొంత నియోజకవర్గం కావడంతో అభివృద్ధి పై ఫోకస్ చేస్తున్నారు పవన్. పిఠాపురంలో మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కచ్చితంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు.