మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్…రెండు రోజుల కిందట… తన పదవికి రాజీనామా చేస్తానని జగన్ దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే… ఆ ఎపిసోడ్ మరువక ముందే.. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసిపి గెలవబోతోందని, జగన్ మళ్ళీ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.
అలా జరగకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్పుకోచ్చారు. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమని ప్రకటిస్తున్న వేళ, ధర్మాన కృష్ణ దాస్ నోటివెంట ఈ మాట రావడం ఆసక్తికరంగా మారింది.
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణ దాస్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అంటూ జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేస్తారన్నారు.