ఏపీలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడి…రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ కృష్ణ, పల్నాడు, NTR, GNT, ప్రకాశం, NLR, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల… రేపు అల్లూరి, ELR, కృష్ణా, NTR జిల్లాలో అతి బారి వర్షాలు పడతాయని హెచ్చరించింది.
మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురు గాలులతో పాటు పలుచోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇక భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో లంక గ్రామాల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. 175 గేట్లను ఎత్తి 7.80 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి కృష్ణ జిల్లాలోని గుడివాడలో 9 సెంటీమీటర్లు, మచిలీపట్నంలో 7, అవనిగడ్డలో 6, విజయవాడలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.