గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి..!

-

గుండె పోటు.. ఇటీవల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు చాలా మంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా – ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… శ్రీ సత్యసాయి జిల్లా – ధర్మవరంలో ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద ఎప్పటి లాగే సాంగ్స్‌ పెట్టుకుని.. ఎంజాయ్‌ చేశారు. ఈ తరుణంలోనే.. ప్రసాద్ (26) అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అయితే… ఆస్పత్రికి తీసుకుని వెళ్లడానికి ముందే… ప్రసాద్ (26) మృతి చెందాడట. దీంతో ధర్మవరంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

https://x.com/TeluguScribe/status/1704684931312754927?s=20

Read more RELATED
Recommended to you

Latest news