ఎన్డీఏ కూటమి నేతల మధ్య విభేదాలు.. టిడిపి నాయకులపై సిబిఐ విచారణ!

-

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్డీఏ కూటమినేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓబులాపురం గనుల్లో అక్రమంగా ఐరన్ ఓర్ ను తరలించే వారికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు కాపు రామచంద్రారెడ్డి.

రాయదుర్గంలో మట్టి, ఇసుకతో పాటు సిబిఐ అధికారులు సీజ్ చేసిన ఐరన్ ఓర్ ను కూడా టిడిపి నాయకులు అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఓబులాపురం గనుల్లో సీజ్ చేసిన యంత్రాల స్క్రాప్ ను కూడా టిడిపి నాయకులు దొంగిలిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గంలో టిడిపి నాయకుల అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని లేఖ రాశాను అన్నారు కాపు రామచంద్రారెడ్డి.

అదేవిధంగా సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా ఫిర్యాదు చేశానన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయదుర్గంలో నా కంపెనీలపై ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు దెబ్బ కొట్టారని ఆరోపించారు. కాల్వ గెలుపుకు కృషిచేసిన తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news