సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల ప్రకటన

-

సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుందని సజ్జల ప్రకటన చేశారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘట ఆంక్షలు విధించిన నేపథ్యంలో సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు.

వాలంటీర్లను తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం దుర్మార్గం అంటూ ఫైర్‌ అయ్యారు సజ్జల రామకృష్ణా రెడ్డి. బాబు పాలన అంతా విధ్వంసం…ప్రజలను ఇబ్బంది పెడతారు…. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు.

వాలంటరీ ల వ్యవస్థ పై ముందు నుంచి చంద్ర బాబు కక్ష్య పెంచుకున్నారుఎన్నికల పేరుతో వాలంటరీ ల వ్యవస్థ ను ఆపాలని చంద్ర బాబు ఇండైరెక్ట్ గా ఈసీ కి పిర్యాదు ఇప్పించారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణా రెడ్డి.చంద్రబాబు తీరును ప్రజలంతా గమనించాలి, చంద్రబాబుకు తన లాభం తప్ప ప్రజల ప్రయోజనం అవసరం లేదని సజ్జల వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news