నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

-

నూతన ఆరోగ్య శ్రీ కార్డులను నేటి నుంచి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిధిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల్ని అందజేసే కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కార్డుల్ని అందిస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే, రేషన్ కార్డులు ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది.

రేషన్ కార్డులు ఉన్నవారికి సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు సరుకు తరలించారు. కేజీ రూ. 67 చొప్పున అందించనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలు చేస్తుండగా…జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి, సరాఫరా చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version