Pawan Kalyan: ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జీతం ఎంత తీసుకుంటారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఏపీ లెక్కల ప్రకారం.. ఒక్కో ఎమ్మెల్యే 3.35 లక్షలు నెలకు జీతం తీసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే తీసుకోనున్నాడు. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేన అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తెలిపారు.
కొంతమంది ఆదర్శ నేతల మాదిరిగా ఒక్క రూపాయి జీతం తాను తీసుకోనని జనసేనని పరోక్షంగా చెప్పారు. అందుకు గల కారణాన్ని సైతం వివరించారు. ప్రతి రూపాయికి ప్రజలు రేపు పొద్దున నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి. మీకు డబ్బులు ఇచ్చాం, మా టాక్స్ పెయిడ్ మనీ తోని నువ్వెందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండటం కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఆ డబ్బు ప్రజలు రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు బాధ్యత గుర్తుకు రావాలి. అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అంతకు వెయ్యింతలు ప్రజలకు ఇస్తానని జనసేనాని చెప్పారు. జవాబుదారీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో…. ప్రజలకు చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.