BREAKING: TTD బోర్డు చైర్మన్ గా కొణిదెల నాగబాబు ?

-

టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదెల నాగబాబు అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు టీటీడీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్‌ శ్రీకారం చేస్తున్నారట. అలాగే కేంద్ర, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం.. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని చంద్రబాబుతో మంతనాలు చేస్తున్నారట పవన్‌ కళ్యాణ్‌.

కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి పెట్టారట. విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను సిఫారసు చేయనున్నారట సుజన, చిన్ని.దశాబ్ది కాలంగా జనసేన నమ్ముకున్న వారందరికీ.. న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్‌ కల్‌యాణ్‌. స్థానిక సంస్థల్లోనూ.. జన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version