చంద్రబాబు విప్లవకారుడిలా కనిపిస్తున్నారా.. టీడీపీ పై సజ్జల ఆగ్రహం..!

-

 స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలు , ధర్నాలపై ప్రభుత్వ సలహాదారు , వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సభ ఏర్పాట్లను ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు.  

 గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ ప్రజాప్రతినిధులు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఓ అవినీతి కేసులో అరెస్ట్ అయితే టీడీపీ నేతలు ఓ విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం , దాని అనుబంధ శక్తులు చేస్తున్న దుష్ప్రచారంపై రేపటి సభలో జగన్ ఎండగడతారని సజ్జల పేర్కొన్నారు.   

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని  ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అక్టోబర్ 9వ తేదీన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. 

Read more RELATED
Recommended to you

Latest news