ఏ ఆత్మలు దెయ్యాలుగా, ప్రేతాత్మలుగా మారతాయో తెలుసా..?

-

చనిపోయిన వాళ్లు అందరూ దెయ్యాలుగా మారతారు అని చాలామంది అనుకుంటారు. కానీ అన్నీ ఆత్మలు దెయ్యాలుగా మారవు.. కొన్ని మాత్రమే దెయ్యాలుగా, ప్రేతాత్మలుగా మారి బతికి ఉన్నవారిని ఇబ్బందిపెడతాయి. గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయో.? దెయ్యాలుగా తిరిగే ఆత్మలు ఏవో తెలుసుకుందాం.. ముందుగా ఒక్క విషయం.. మీకు దెయ్యాలంటే.. భయం ఉన్నా, మీరు వీక్‌గా ఉన్నా.. లైట్‌ తీసుకుని స్టోరీ స్కిప్‌ చేయండి.. బాగా ఇంట్రస్ట్ ఉంటే మాత్రం శ్రద్ధగా చదవండి..!

గరుడ పురాణంలో జననం, మరణం, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పాపం, పుణ్యం, నీతి, ధ‌ర్మం, జ్ఞానానికి సంబంధించిన విషయాలను వెల్ల‌డిస్తుంది. దీనితో పాటు, మరణం తరువాత ఆత్మ మానవ రూపంలోకి, ప్రేత రూపంలోకి మార‌డం గురించి కూడా స్ప‌ష్టంగా వివ‌రించింది.

 

మరణం తర్వాత
మరణానంతరం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆకలి, దాహం, కోపం, దుఃఖం, కామం అనే ల‌క్ష‌ణాలను కలిగి ఉంటాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల జీవుల‌ గురించి ప్రస్తావించారు. ఇందులో జంతువు, పక్షి, చెట్టు, క్రిమి కీట‌కాలు, మానవుడు వంటి ఆత్మలు ఉన్నాయి. మరణం తరువాత ఒక వ్యక్తి ఆత్మ ఏ జన్మకు వెళ్తుందో, అది అతని జీవితకాలంలో చేసిన‌ పనులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దుర్మార్గుల ఆత్మలు మృత్యులోకంలో సంచరిస్తూనే ఉంటాయి. మరోవైపు.. ప్రమాదం, హత్య లేదా ఆత్మహత్య మొదలైన వాటి కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే, అంటే.. ఆత్మ తన శరీరాన్ని సహజ మరణంతో విడిచిపెట్టకపోతే, ఆత్మ ప్రేతాత్మగా మారి తిరుగుతుంది.

దెయ్యాల రహస్యం ఏంటి..?
గరుడ పురాణం ప్రకారం..మరణం తర్వాత ఆత్మ శాంతిని పొందదు లేదా ఆత్మ సహజమైన పద్ధతిలో తన శరీరాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో ఆత్మ ప్రేతాత్మగా సంచరిస్తూనే ఉంటుంది. అందుకే మరణానంతరం మరణించిన వ్యక్తికి నిర్వ‌హించాల్సిన‌ పిండ ప్ర‌దానం, శ్రాద్ధ క‌ర్మ‌ల‌ గురించి గ్రంథాలు చెబుతున్నాయి. నియమానుసారంగా పిండప్ర‌దానం, శ్రాద్ధ క‌ర్మ‌ల‌ను చేయడం వల్ల పితృదేవ‌త‌ల‌ ఆత్మకు శాంతి కలుగుతుంది. నెరవేరని కర్మలు లేదా చెడు పనుల వల్ల ఆత్మలు మృత్యు భూమిలో సంచరిస్తూనే ఉంటాయి. ఇలా ప్రేతాత్మ‌లుగా మారిన ఆత్మ‌లు ఏ రూపంలో ఉన్నా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి ఆత్మలను మనం సాధారణ పరిభాషలో దెయ్యాలు అంటాము. అందుకే మానవుడు తన జీవితకాలంలో పాప క‌ర్మ‌లు చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది.

తన జీవిత కాలంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుణ్యకార్యాలు ఆచరించేవాడు అందరికీ సుఖ సౌఖ్యాలు కలిగించి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడ‌ని గ‌రుడ పురాణం స్ప‌ష్టం చేస్తోంది…

ఇవన్నీ నమ్మావంటే.. నువ్వు నీ ఫేస్‌ లాగే కన్నాలేసుకోని బతకాలి అని డైలాగ్‌ మీకు వెంటనే గుర్తు వచ్చి ఉంటుంది.! ఇప్పుడు నెట్టింట ఇదే బాగా ట్రెండింగ్‌లో ఉంది. గరుడ పురాణం ప్రకారం.. చెప్పిందే మేం మీకు అందించాం కానీ ‘మనలోకం’ సొంతంగా రాసింది కాదు. నమ్మకం ఉన్నవారు తప్పక తెలుసుకుంటారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version