అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మే డే సందర్భంగా కార్మికులు, శ్రామికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రక్తం ధారపోసి పని చేసే వారు లేకపోతే ఏ నిర్మాణం జరగదు. మిగతా వృత్తుల్లో ఉన్న వారి మాదిరిగానే శ్రామికులు కూడా గొప్పవారే అని తెలిపారు.
ఈరోజు నుంచి ఉపాధి హామీ కూలీలు కాదు.. ఉపాధి శ్రామికులు అని పిలవాలని చెప్పారు. దేశాభివృద్ధికి కృషి చేసే వాళ్లు శ్రామికులు అవుతారు. కానీ కూలీలు కాదనీ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. వారే లేకపోతే రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం ఉండదని తెలిపారు. శ్రామికుల కష్టాన్ని వారి నైపుణ్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని కాబట్టే వారిని కూలీలు అని పిలవకూడదని చెబుతున్నానని తెలిపారు.