అణగారిన వర్గాలకు చాంపియన్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 48 ఏళ్లు. ఈ దేశాన్ని పరిపాలించి ఏనాడు బీసీ కులగణన చేపట్టలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీఎస్సీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు కలగణన (Caste Census చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మొసలి కన్నీరుకు చెంపపెట్టులా కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణన చేపట్టబోతున్నదని చెప్పారు. కులగణను సమర్థిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇది ఓబీసీలకు గొప్ప గుర్తింపు అన్నారు. కులగణనతో రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల్లో ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగనున్నాయన్నారు.
కులగణన నిర్ణయంతో బీజేపీ ఒక్కటే అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని నిరూపితం అయిందని ఈటల అన్నారు. ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిగా ఒక దళిత బిడ్డను, ఆదివాసి మహిళను రాష్ట్రపతులను చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8] మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించారు. 60 శాతం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం కల్పించినట్లు చెప్పారు. కులగణనకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.