తిరుమల వాసులకు శుభవార్త అందింది.. తిరుమలలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లపై తొలిసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెట్టింది. తిరుపతి రోడ్లపై దీన్ని తిప్పారు.
త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తెలిపారు. ఏఏ మార్గాల్లో నడపాలి అనేది ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. రూ. 2 కోట్లతో బస్సును కొనుగోలు చేయగా… మూడు గంటలు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నడవనుంది.
ఇది ఇలా ఉండగా, తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించని ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం వచ్చింది. 18వ తేదీన టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలు పంపిణీ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. బ్రహ్మోత్సవాలలో భాగంగానే తిరుమలకు సీఎం జగన్ వస్తున్నారు. ఈ తరుణంలోనే ఇంటి స్థలాల పత్రాలు పంపిణీ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.