ఓటీటీలోకి వచ్చేసింది చిరంజీవి హీరోగా చేసిన ‘భోళాశంకర్’ సినిమా. ఈమధ్య థియేటర్లో సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయో లేదో కొద్దిరోజులకే అలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. హిట్ సినిమాలు రావడానికి కాస్త సమయం పడుతోంది కానీ థియేటర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు మాత్రం చాలా త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

తాజాగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచినప్పటికీ చిరంజీవి టైమింగ్, డ్యాన్స్, నటన ఆకట్టుకుంది. ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇక థియేటర్ లో చూడని వారు.. ఓటీటీలో భోళాశంకర్ మూవీ చూసేయండని చిత్ర బృందం కోరింది.