అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ సర్టిఫికెట్‌

-

కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. స్టేషన్ లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్ లో ఆహార భద్రత, పరిశుభ్రత, విక్రేత వ్యక్తిగత శుభ్రత, ఫుడ్ గడువు తేదీలు, వ్యర్ధాల తొలగింపు వంటివి పరిగణలోకి తీసుకొని అవార్డు అందించారు.

Eat Right Station certificate for Annavaram Railway Station

ఇక అటు ఏపీ రైతులకు అలర్ట్‌..ఈ-కేవైసీపై కీలక ప్రకటన చేసింది జగన్‌ సర్కార్‌. ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని…. త్వరగా ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదును పూర్తి చేయాలంది. అటు పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంకు అకౌంట్లు లింక్ చేయనివారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version