ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగిన తరువాత జూన్ 04న నిర్వహిస్తారు. ఎన్నికలు మే 13న జరిగితే వారం రోజుల ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. కాగా ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడంతో ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది. గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓటును చెల్లని ఓటుగా పరిగణించవద్దని, గెజిటెడ్ అధికారి స్టాంప్ లేకపోయినా ఓటు చెల్లుతుందని పేర్కొంది. ఫామ్ 13-ఏ పై RO సంతకంతో పాటు అన్ని వివరాలుండాలని.. RO సంతకం, బ్యాలెట్ ను ధ్రువీకరించే రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలంది. ఫామ్ 13 ఏలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నెంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని పేర్కొంది ఈసీ.