ఏపీ సీఎం జగన్ కు ఈసీ నోటీసులు..!

-

ఏపీ సీఎం జగన్‌కు భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై  జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి  ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ.

ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో జగన్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అలవాటు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చసశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా జగన్ కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ నేతల ఫిర్యాదుకు స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఈసీ.

Read more RELATED
Recommended to you

Latest news