అనిల్ అంబానీ మరో షాక్ తగిలింది. అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేసింది ఈడీ. ఇప్పటికే రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు… అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేశారు.

అంతకు ముందు ఆగస్టు 5వ తేదీన విచారణకు హాజరు కావాలని… ఈ నోటీసులలో పేర్కొంది ఈడి అధికార బృందం. ఒకవేళ హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇది ఉండగా ఇటీవల కాలంలోనే…. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 40 కి పైగా ప్రాంతాల్లో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే నోటీసులు జారీ అయ్యాయి.