తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 5వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోనీ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అదే సమయంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రెండు బలపడితే ఆగస్టు 5వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా స్పష్టం చేసింది. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభావం ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేసింది.