తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..!

-

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం.. ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ.. 50 మంది సభ్యుల్లో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికీ వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి.

కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఇన్ చార్జీ భూమన అభినయ్ రెడ్డి ఆరోపణల ప్రకారం.. కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తలరించారని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా.. వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ ను రంగంలోకి దించింది. వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news