ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లించే రోజు వారి వేతనాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రస్తుతం 272 రూపాయలు చొప్పున అంది రోజు వారి గరిష్ట వేతనాన్ని ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 300 రూపాయలకు పెంచింది జగన్ సర్కార్. మొత్తం గా రోజువారి గరిష్ట కోరి రేటు 28 రూపాయలకు పెంచడం ఉంది మనం చూస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండే దాదాపు 46 లక్షలకు పైగా పేద కుటుంబాలు వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం పనుల మీద ఆధారపడుతూ ఉంటాయి. ఈ పథకం ద్వారా ఒక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా 100 రోజులపాటు పనులు చేసుకునే వసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ తాజా పెంపు నిర్ణయం ద్వారా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2800 దాకా అదనపు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.