ఎటుతేల‌ని పీఆర్సీ ర‌గ‌డ‌.. నేడు ప్ర‌భుత్వంతో మ‌రోసారి చ‌ర్చ‌లు

-

పీఆర్సీ నివేదికపై శుక్ర‌వారం రాత్రి మంత్రుల క‌మిటీతో పీఆర్సీ సాధ‌న స‌మితి, ఉద్యోగ సంఘాలు స‌మావేశం అయ్యాయి. అయితే ఈ స‌మావేశంలో పీఆర్సీ అంశంపై ఎటు తేల‌లేదు. దీంతో ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రోసారి మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాలు స‌మావేశం కానున్నాయి. దీని త‌ర్వాత మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌రో సారి మంత్రుల క‌మిటీతో ఉద్యోగ సంఘాలు స‌మావేశం అవుతాయ‌ని తెలుస్తుంది. కాగ శుక్ర వారం జ‌రిగిన స‌మావేశంలో పీఆర్సీపై స్ప‌ష్టత రాలేదు. దీంతో మ‌రో సారి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

అయితే త‌ము చెప్పాల్సింది మొత్తం మంత్రుల‌కు చెప్పామ‌ని.. ఇక నిర్ణ‌యం వారిదే అని ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. అయితే శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశం ఆశాజ‌న‌కంగానే ఉంద‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణ రెడ్డి తెలిపారు. నేడు స‌మావేశంతో పూర్తి స్ప‌ష్టత వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగ ఉద్యోగులు నేటి నుంచి స‌హాయ నిరాకర‌ణోద్య‌మం చేయ‌డంతో పాటు స‌మ్మె కూడా సిద్ధం కావ‌డంతో అత్య‌వ‌సరంగా శుక్ర‌వారం ఉద్యోగ సంఘాల‌తో ప్ర‌భుత్వం క‌మిటీ చ‌ర్చ‌లు జ‌రిపింది.

ఉద్యోగులు చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌కుండా.. చూడాల‌ని సీఎం జ‌గ‌న్ మంత్రుల‌కు సూచించిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు కూడా చర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే నేటి చ‌ర్చ‌ల‌తో పీఆర్సీ ర‌గ‌డ ముగుస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version