రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే !

-

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందేనని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని… గుంటూరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.దొంగ ఓట్లు మీద ఎలాంటి ఫిర్యాదు మాకు అందలేదు….కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని వివరించారు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.

EVMs have to be protected

పోలింగ్ అనంతరం, పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములకు తరలించాం…రాబోయే 20 రోజులు స్ట్రాంగ్ రూమ్ లోని ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతామని వెల్లడించారు. కౌంటింగ్ జరిగే వరకు ఈవీఎంలకు ప్రత్యేక భద్రత ఉందన్నారు. ఈవీఎంల భద్రత కోసం మూడు అంచల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం…కేంద్ర బలగాల, తో పాటు రాష్ట్ర బలగాలు ,సివిల్ పోలీసులు కూడా ఈవీఎంలకు భద్రతగా ఉంటారు…. ఈవీఎంల భద్రత గురించి ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు అమర్చామని వివరించారు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news